Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు వియ్యంకుడు, వనస్థలిపురం డివిజన్‌కి చెం దిన మాజీ కౌన్సిలర్, టీఆర్ ఎస్ నాయకులు నీల అంజన్ కుమార్‌గౌడ్, మన్సురాబాద్ డివిజన్‌కి చెందిన మాజీ తెలంగాణ జేఏసీి ఎల్.బి నగర్ కన్వీనర్ ఆలే పురేందర్, కొత్తపేట డివిజన్‌కి చెందిన తెలంగాణ జేఏసీి ఉద్యమ నాయకుడు రాకేష్ ఆదివారం ఎల్.బినగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం సామరంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని, శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు భారీ బహిరంగ సభ అందుకు నిదర్శనం అన్నారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రజలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు కూడా బీజేపీలోకి అతి త్వరలో వస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు వంగ మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నరసింహ గుప్తా, కళ్లెం నవ జీవన్‌రెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పవన్‌కుమార్, సుజాతనాయక్, కొత్త రవీందర్‌గౌడ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, కష్ణవేణి, ఆకుల పవన్ కుమార్, రామేశ్వర్, నూతి శ్రీనివాస్, సుందర్ నారాయణ, విజరు కుమార్, దశరథ్ సాగర్, గణేష్‌గౌడ్ పాల్గొన్నారు.