Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్లోని మహాత్మా గాంధీ లా కళాశాలలో లా విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసుకున్న సందర్భంగా లా కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ వీడ్కోలు సమా వేశానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి న్యాయ విద్యార్థి న్యాయ శాస్త్రం పట్ల పూర్తి జ్ఞానాన్ని సంపాదించి పేదలకు సకాలంలో న్యాయం అందించాలని కోరారు. ప్రతినిత్యం న్యాయ శాస్త్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలని కోరారు. కక్షిదారులకు, కోర్టులకు మధ్య న్యాయవాదులు వారధిగా ఉండాలని కోరారు. తెలంగాణ జుడీషియల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో నేర్చుకున్న విద్యను ఉపయోగించుకొని కోర్టులో న్యాయవాదిగా పేరు సంపాదించుకోవాలి అన్నారు. న్యాయవాద వత్తి స్వీకరించి వచ్చే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడాలని కోరారు. కరీంనగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్ మాట్లాడుతూ చట్టాలను తెలుసుకొని అందరికీ న్యాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల చైర్మెన్ గంగుల గోవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిబ్బంది, లా విద్యార్థులు పాల్గొన్నారు.