Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన వైద్యం అందించినప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది
- ఏబీ న్యూ లైఫ్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పధంతో ఆస్పత్రుల నిర్వ హణ ఉండాలని, అంతే కాకుండా నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఆది వారం నాడు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో నూత నంగా ఏర్పాటు చేసిన ఏబీ న్యూ లైఫ్ ఆస్పత్రిని ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అన్నారు. అన్ని వసతులతో కూడిన వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి నమ్మకంగా వైద్యం అందించడం ద్వారా ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్, డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్, డాక్టర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు పిట్టల మల్లేష్ ముదిరాజ్, ఎన్.మధుసూదన్ రెడ్డి, బొడిగె స్వాతీ కష్ణగౌడ్, అనంతరెడ్డి, బండి సతీష్ రమ్య గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి శ్రీరాములు కొల్తురి సాయి, హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బి.బాలక్రిష, అంజన్ కుమార్, శరత్ గౌడ్, మత్స్యగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గిరీష్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.