Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు పెండ్యాల నగేష్
నవతెలంగాణ-సరూర్నగర్
మోడీజీ సిలిండర్ తీసుకుపో, కట్టెల పోయి ఇచ్చిపో అని ఆర్కెపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మద్దతుగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఆర్కే పురం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు. అభివద్ధిపై అవగాహన లేకుండా, ప్రజల మధ్య కుల, మత చిచ్చు లేపడం ఓట్లు దండుకోవడం వారి పని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు అరవింద్ శర్మ, సాజిద్, గొడుగు శ్రీనివాస్, జాహీద్, శ్రీరాములు, రమేష్, యాదవ రెడ్డి, కంచర్ల శేఖర్, చోటు, పెంబర్తి శ్రీనివాస్, ఊర్మిళ రెడ్డి, పటేల్ సునీత రెడ్డి, మాధవి, సక్కుబాయి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.