Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ- జగద్గిరిగుట్ట
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయాలతో శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్లో రోడామేస్త్రీనగర్ బిలోని అక్సా మజీద్ కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రేవ్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం బస్తీలో సీసీ రోడ్లు, అక్సా మజీద్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బదిలీ చేయాలని మజీద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు అబ్దుల్ ఆరిఫ్, జహంగీర్, హుస్సేన్, కమిటీ సభ్యులు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.