Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
సాహిత్య, సాంస్కతిక రంగాలు ప్రజల వైపు ఉండాలని పలువురు వక్తలు సూచించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య ఆధ్వర్యంలో అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వర రావు, అరుణోదయ రామారావు, రాజేంద్ర ప్రసాద్‌ల యాదిలో పాట, మాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా కళలు, గళాలు ప్రతిపక్ష పాత్రను పోషించాలి తప్ప ప్రభుత్వాలకు ఊడిగం చేయారాదన్నారు. బీజేపీ నీచమైన బుల్డోజర్ల సంస్కతికి ఎదురొడ్డి పోరాడటానికి కళాకారులు ప్రజల్లో చైతన్యం తెస్తారని చెప్పారు. కార్యక్రమంలో వెళ్లి సురేష్, చలపతిరావు సుంకన్న, అరుణోదయ నాగన్న, వేణు, బిచ్చ, టీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, నవతెలంగాణ బుక్ హౌస్ కార్యదర్శి కె చంద్రమోహన్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ పాల్గొన్నారు.