Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మూఢవిశ్వాసాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రశ్నించడం నేర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో అంబర్‌పేట పటేల్‌నగర్‌లో నిర్వహించిన వేసవి సైన్స్ సంబరాలు ముగింపు కార్యక్రమంలో కోయ వెంకటేశ్వరరావు, డాక్టర్ రమావేది పాల్గొని పిల్లలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించి విద్యార్థులకు అనేక శాస్త్రీయ అంశాలను నేర్పడం అభినందనీయమని అన్నారు. వేసవి సైన్స్ సంబరాలు పిల్లల జీవితాలలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దక్పథంతో ఆలోచించాలని కోరారు. సమ్మర్ క్యాంప్‌లో నేర్చుకున్న విషయాలను పిల్లలతో చర్చించి, అనేక సూచనలు చేశారు. ఖగోళశాస్త్ర నిపుణులు రుక్మిణి మాట్లాడుతూ టెలిస్కోప్‌తో పిల్లలకు, కాలనీ ప్రజలకు సూర్యున్ని చూపించి అనేక విషయాలను తెలియజేశారు. సమ్మర్ క్యాంప్‌లో పది రోజుల పాటు నిర్వాహకులుగా విద్యాసాగర్‌తో పాటు విక్రమ్, పద్మలు పిల్లలకు అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, హైదరబాద్ కమిటి సభ్యులు గోవర్దన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.