Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య కొలకలూరి ఇనాక్
నవతెలంగాణ-ముషీరాబాద్
బాలల కోసం కందేపి రాణి ప్రసాద్ సష్టించిన సాహిత్యం అద్భుతమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. అంగల కురిటి సుందరాచారి చారిటీస్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్లింగంపల్లిలోని ఎన్జీవోస్ నెట్ వర్క్ కార్యాలయంలో సాహిత్య కళా సేవా రంగాల ప్రముఖులకు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం, పుస్తకాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్ డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ రాసిన కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ నాగేశ్వరం శంకరం పుస్తకాన్ని సమీక్షించారు. వాసిరెడ్డి మల్లేశ్వరి, డాక్టర్ రాజేష్, వడ్డేపల్లి కష్ణ, రాణి ప్రసాద్ రాసిన సౌరభం, నా జ్ఞాపకాలలో అమ్మ, క్వారంటైన్, ద్రాక్ష గుత్తులు, తదితర పుస్తకాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు సినీ కార్మిక బందు బిరుదును ప్రదానం చేశారు. డాక్టర్ వీబీ రాజగోపాల్, అంజనీ కుమార్లకు సుందరాచారి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ప్రముఖ రచయితలు డాక్టర్ అమరవాది నీరజ, సలీమ, నస్రీన్ శరత్ సు దర్శి, రమాదేవి, లలిత తదితరుల పుస్తకాలకు జాతీయ పురస్కారాలు అందజేశారు. బాల సాహిత్యం ద్వారా రామి ప్రసాద్ కషి చేయడంతోపాటు కవులు, రచయితలను గుర్తించి పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనం ఆహుతులను ఎంతగానో అలరించింది.