Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
అంగన్వాడీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) చాంద్రాయణగుట్ట డివిజన్ కార్యదర్శి ఎస్. కిషన్, స్వామి, ఎం.డి గౌస్ డిమాండ్ చేశారు. ఆదివారం చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఎవ్వరికీ ఉపయోగం లేకుండాపోయిందన్నారు. దీనికి తోడు అస్థలం వ్యర్థపదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగ మారుతుందన్నారు. తద్వారా ప్రజా ధనం వథా అవుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాథమికంగా పిల్లలకు విద్య దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బస్తీవాసులు కష్ణ, నజియా, సత్తయ్య పాల్గొన్నారు.