Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రోడ్డుపై వర్షపు నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పి విజయ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎస్ మక్తా, లక్డీకాపూల్లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిల్వ ఉన్న వర్షపునీటిని పరిశీలించారు. నాలా పూడికతీతలో వ్యర్థాల తీసివేతలు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డుపై మురుగునీరు నిల్వ ఉండకుండా నూతన పైపులైను పనులు చేపట్టాల్సిన అవసరముందని, ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఈఈ ఇందిరా బాయి, డీఈ చైతన్య, ఏఈ చరణ్, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు రాజా, అఫ్జల్ , షరీఫ్, కరీమ్, నారాయణ గౌడ్, జఫర్, రమేష్ పాల్గొన్నారు.