Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రయినేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కైత్లాపూర్ వద్ద నిర్మిస్తున్న నూతన ఫ్లై ఓవర్‌కు సంబంధించిన పనులు ఎంత వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని, అభివృద్దే ఎజెండాగా ముందుకెళ్తున్నామన్నారు. తప్పకుండా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎప్పుడు తోడుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఫ్లై ఒవర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. బాలానగర్, మూసాపేట, బోరబండ, అల్లాపూర్ మీదుగా హైటెక్ సిటి వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయమై ఆనందం వ్యక్తం చేశారు.