Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
చేసే పని పట్ల అంకిత భావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం శ్రీనగర్ కాలనీ లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విశిష్ట గురు పురస్కార సభలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కేంద్ర సంగీత నాటక అకాడమీకి కార్య నిర్వాహక సభ్యులుగా డా.ఎస్.పి.భారతి నియమితులయ్యారు. ఆమెను మంత్రి శాలువాతో, గజమా లతో సత్కరించారు. జ్ఞాపికను, ప్రశంసాపత్రాన్ని అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డా.భారతి 40 ఏండ్లుగా నాట్య గురువుగా, కళాభి నేత్రిగా రాణిస్తు న్నారని గుర్తు చేశారు. ఆమెను యువ కళాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నాట్య రంగంలో ఎందరో కళాకారులు ఆమె శిక్షణలో భిన్న వేదికలపై ప్రదర్శనలతో అలరిస్తున్నారని తెలిపారు. జీవితంలో విద్యతో పాటు వినోదం ఎంతో అవసరమన్నారు. తెలుగు విశ్వ విద్యాల యం మాజీ ప్రొఫెసర్ డా.సుదర్శన్ మాట్లాడుతూ భారతి ఎంతో అంకిత భావంతో శిక్షణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమం ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించగా, సామాజికవేత్త నగేష్ పెండ్యాలతో పాటు పలువురు కళాభిమానులు పాల్గొన్నారు.