Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కొలుకుల జగన్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ సాధ్యపడుతుందని జగద్గిరిగుట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మగ్దూంనగర్లోని కార్పొరేటర్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమకాటు వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ వ్యాధి పట్ల ఆశ్రద్ద చేస్తే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూత్ నాయకులు కొలుకుల జైహింద్, నాయకులు మురళీ, వెంకటేష్, పాస్టన్ డేవిడ్, ప్రసాద్, మల్లారెడ్డి, గూడ సంతోష్, ఎంటామాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.