Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను దూరం చేయవచ్చని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ ఆన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అర్బర్ మలేరియా స్కీమ్ (ఎంటమాలజీ) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ ప్రాణాంతకమైన వ్యాధి అని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ వ్యాధితో పాటు మలేరియా వ్యాధిని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇండ్లలోని వస్తువులను శుభ్రపరుచుకుని దోమలను నివారించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్ వైజర్ రాఘవేందర్, టీఆర్ఎస్ నాయకులు లింగారావు, మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి పాల్గొన్నారు.