Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్
- శాస్త్రీయ అధ్యయన వేదిక ఆవిర్భావం
నవతెలంగాణ-ముషీరాబాద్
మూఢనమ్మకాలు, వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ అధ్యయన వేదిక ఆవిర్భావం జరిగింది. ఈ కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్, భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు బీడీ సారయ్య, ద్రవిడ సిటీ మూమెంట్ రాష్ట్ర కన్వీనర్ అభిలాష హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ప్రతి ఒక్కరూ కుల, మత రహిత సమాజం కోసం పని చేయాలన్నారు. శాస్త్రీయ దక్పథంతో ఆలోచించాలన్నారు. అనంతరం వేదిక కన్వీనర్‌గా చార్వాక, కో కన్వీనర్‌గా పుల్లూరి హరిబాబు, బాలు నాయక్, అల్లం రమేష్, హరి తదితరులను ఎన్నుకున్నారు.