Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పెండింగ్‌లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళ వారం హైదరాబాద్ నుంచి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఓటర్ల దరఖా స్తులు, ఓటర్ జాబితాలో రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం వంటి వాటిని వెంటనే తొలగించి ఒకే దగ్గర ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. 30 రోజులకు పైబడి పెండింగ్‌లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ, మార్పుల ప్రక్రియ వేగవంతం : కలెక్టర్ హరీశ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పుల ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఫొటో సిమిలర్ ఎంట్రీలు పూర్తి కావచ్చాయని తెలిపారు. జిల్లాలో ఓటర్ల జాబితాలో ఏమైనా పొరపాట్లు, లాజికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తిస్థాయిలో సవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామ నీ, పక్కా ప్రణాళిక ప్రకారం ఓటరు జాబితాను సిద్దం చేయనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి తొలిగిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పకడ్భందీగా ఉండేలా అధికారులు, సిబ్బందితో పనులు జరుగుతున్నాయనీ, ఏమాత్రం లోపా లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవో రవి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.