Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గస్థాయి అధికారులతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని బడులకు మహర్దశ రానుందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 7,289 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల్లో మొదటి విడతలో రూ. 3497 కోట్లతో 9123 పాఠశాలలో 12 రకాల సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మార్చేలా పనులు ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలగూడ గీతాంజలి లయన్స్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, గీతాంజలి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ రఘు, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ, అడ్వైజర్ చెన్నకిషన్ రెడ్డి, సిద్దాల లావణ్య, టీఆర్ఎస్ అధ్యక్షులు కామేశ్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అనిల్ యాదవ్, లయన్స్ క్లబ్ సభ్యులు సిద్దాల బీరప్ప, బొక్క రాజేందర్రెడ్డి, కార్పొరేటర్లు కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.