Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఎంవీ యాక్ట్-2019ను వెంటనే రద్దు చేయాలని ఆటో యూనియన్
(సీఐటీయూ) హైదరాబాద్ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ అజీజ్ బాబా డిమాండ్ చేశారు. ఫిట్నెస్ రెన్యువల్ లేట్ ఫీ రూ.50లను వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టిన 'ట్రాన్స్పోర్ట్ బంద్' పోస్టర్‌ను మంగళవారం అఫ్జల్‌గంజ్ ఆటోస్టాండ్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆటో కార్మికులకు కనీసం రోజు వారి ఫైనాన్స్, పెట్రోల్ చార్జీలు కూడా రావడం లేదని, దీనికితోడు ఫిట్నెస్ ఛార్జీలు పెంచి మరో భారం వేశారని వాపోయారు. మోటార్ వెహికిల్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, పెంచిన ఫిట్నెస్ చార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 19న చేపట్టిన ట్రాన్స్పోర్ట్ బంద్‌ను వాహన కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.