Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్
- 260 మందికి సావిత్రిబాయి ఫూలే ఉన్నతి స్కాలర్షిప్ అందజేత
నవతెలంగాణ-ముషీరాబాద్
అనాథ పిల్లలను ఆదరించడం అభినందనీయమని ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెయిన్బో హోమ్స్ ఆధ్వర్యంలో 260 మంది అనాథ విద్యార్థులకు సావిత్రిబాయి ఫూలే ఉన్నతి స్కాలర్షిప్ అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినులను చేరదీసి వారికి ఉన్నత చదువులు అందించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ బాలల కమిషన్ చైర్మెన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు చిన్నచిన్న గొడవలకు విడిపోవడం, మానవ సంబంధాలకు దూరం కావడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారని, అలాంటి వారిని చేరదీసి ఉన్నత విద్యాభ్యాసానికి సహకరిస్తున్న రెయిన్ బో కషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రెయిన్బో హోమ్స్ జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, సిటీ సివిల్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి. భవాని, వనిత తదితరులు పాల్గొన్నారు.