Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి పరిధిలోని చెరువుల్లో పేరుకపోయిన గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలని మంగళవారం కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులను కలిసి వెంటనే గుర్రపుడెక్కను తొలగించి తద్వారా వ్యాప్తి చెందే దోమల వ్యాప్తిని అరిక ట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు జీడీ శ్రీనివాస్ గౌడ్, అశోక్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ యాదవ్, ఉమేష్ సింగ్, వంశీ, రాజలింగం, సంతోష్, చంద్రశేఖర్, గుత్తి రామ్ చందర్, రాములు, సూర్య ప్రకాష్ రెడ్డి, పవన్ కుమార్, మోమిన్ భాష, ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్, సీఎల్ యాదగిరి, సంజీవ్ కుమార్, వినోద్ యాదవ్, కొండ రాజేష్ గౌడ్, శంకర్, మహమ్మద్ అలీ, వాసు, పాండు, రోజా రమణి, ఆశ, యశోద, భాగ్య రాణి, పద్మ, ఫహీమ్, ఆశారాణి, నిర్మలారాజ్, విజయలక్ష్మి, పాల్గొన్నారు.