Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ సబ్ ఏరియాల్లో పని చేయుటకు నూతనంగా రెండు నెలల టెండర్ పొందిన కాంట్రాక్టర్లు సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ గార్డులో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ 7వ తేదీ లోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టులు కంటోన్మెంట్ బోర్డు ఆదేశాలను సైతం పాటించటం లేదనీ, అలాంటి కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కాంట్రాక్టు సంస్థలు కార్మికులకు తక్కువ జీతం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. ఆర్మీ ఏరియాల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకో వాలని కోరారు. అనంతరం కంటోన్మెంట్ సీఈవోతో ఫొన్లో, హెల్త్ సూపరింటెండెంట్‌తో ప్రత్యక్షంగా మాట్లా డి కార్మికుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్ర మంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయ కులు డీబీ దేవేందర్, కాంట్రాక్ట్ కార్మికులు వేణుగోపాల్, నరేష్, శ్రీను, ఆశ, శ్రీలత, సుభాషిణి, సంతోషి, పాల్గొన్నారు.