Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- వైట్ టాపింగ్ రోడ్డు పనుల పరిశీలన
నవతెలంగాణ-బడంగ్‌పేట
సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించినట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ గొల్ల కొమరయ్య కాలనీలో రూ.1.59 కోట్లతో చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహ రించి అవసరమైన చోట్ల రోడ్డు పనులకు ముందే డ్రయి నేజీ, వాటర్ పైప్ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై నిత్యం డ్రయినేజీ నీరు ప్రవహించి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నూతన డ్రయినేజీ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయని చెప్పారు. ప్రధాన రహదారులత పాటు అంతర్గత రహదారుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను పరిష్కరించేందుకు వెనుకాడబోమన్నారు. నియోజ కవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, డ్రయనేజీ లైన్ల ఏర్పాటు, అవసర మైన చోట్ల డ్రయినేజీ, వాటర్ పైప్ లైన్ల పునరుద్దరణ పనులను చేపట్టి పూర్తి చేసినట్టు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ పరిధిలో ప్రజా ఉపయోగకరమైన అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. నూతనంగా మరికొన్ని పనులు మంజూర య్యాయనీ, త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, ఆంజనేయులు, ప్రవీణ్, టౌన్ ప్లానింగ్ క్రిస్టోపర్, నాయకులు వెంకటేష్ రాజు, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు.