Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు అధికారులు మంగళవారం రెండో వార్డులోని రావిచెట్టు గల్లీలో సమస్యలను తెలుసు కునేందుకు పర్యటించారు. కొద్ది రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యలను సర్వే చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో స్పందించి బోర్డు ఇంజినీర్ బాలకృష్ణ, వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శశాంక్ డ్రయినేజీ సమస్య, కలుషిత నీరు ఎక్కడికి వస్తోందని పరిశీలిం చారు. చెట్టు గల్లీలో కాల్వ మొత్తం పొంగిపొర్లి రోడ్డు మీదకు రావడంతో వెంటనే ఈ సమస్యను పరిష్కరి స్తానని చెప్పారు. సీబీ నగర్, శివనగర్, అర్జున్ నగర్లో మొత్తం డ్రయినేజీ వ్యవస్థను కూడా పరిశీలించారు. వెంటనే సీఈఓ దృష్టికి తీసుకెళ్లి నూతన పైపులైను వేస్తానని తెలిపారు. రావి చెట్టు గల్లీలో ఉన్న మట్టి కుప్ప మొత్తం ఎత్తేస్తామనీ, మళ్లీ భవిష్యత్లో అక్కడ చెత్త ఎవరూ వేయొద్దని హెచ్చరించారు. ఎవరైనా చెత్త వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సిబ్బంది, సీపీఐ(ఎం) నాయకులు కొండూరి యాదగిరి, గాడి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.