Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
వంశపారంపర్యంగా తనకు రావాల్సిన స్టిరాస్తిని తన రాకుండా సొంత బంధువులే రాజకీయ నాయకులతో కలిసి బెదిరింపుకు పాల్పడుతున్నారని బోయిన్ పల్లి చిన్న తోకట్టకు చెందిన ఆలూరి కొండల్ యాదవ్ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రెండు వేల చిలుకు గజాలపై బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. 1964లో తన తాత ఆలూరి మల్లేశం యాదవ్ పై 62, 63, 64 సర్వే నంబర్లో ఉన్న ఆరు ఎకరాల భూమి సేల్ డీడీ అయ్యిందనీ, తమ తాత వారసత్వంలో మొత్తం తనతో కలిపి 10 మంది ఉన్నట్టు కొండల్ యాదవ్ తెలిపారు. ఈ 10 మందిలో (కొండల్ యాదవ్) తప్తా మిగతా 9 మంది పలుబడి ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులతో కలిసి మొత్తం భూమిని కాజేయాలని చూస్తున్నారనీ, కోర్టులో భూ కేసు పెండింగ్ ఉన్నా ఇల్లీగల్‌గా 40 ఏండ్లకకు పైబడిన పెద్ద పెద్ద చెట్లను జేసీబీతో తొలగించి ప్రహరీ గోడ నిర్మాణాలు చేస్తున్నారనీ, తన ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు కొండల్ యాదవ్ ఆరోపించారు. జరుగుతున్న ఇల్లీగల్ విషయాన్ని స్థానిక పోలీసులు, ఆర్డీఓ, తహసీల్దార్, జాయింట్ కలెక్టర్, కంటోన్మెంట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పది పార్టీషన్స్లో తనకు వాటాకు రావాల్సిన రెండు వేల గజాల పై చిలుకు భూమి దగ్గరికి ఎవరూ రావద్దనీ, న్యాయపరంగా తన భూమి తనకే చెందాలనీ, కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్న భూమిలో ఎవరూ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కొండల్ యాదవ్ డిమాండ్ చేశారు.