Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మర్రి లక్ష్మణ్‌రెడ్డిని మంగళవారం కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మెన్ జంపన ప్రతాప్ సన్మాని ంచారు. బెంగళూరులో ఈ నెల 11-15వ తేదీ వరకు జరిగిన ఫస్ట్ పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ జాతీయ స్థాయి స్విమ్మింగ్ 200 మీటర్స్, 100 మీటర్స్. ఫ్రీ స్టీల్ పోటీల్లో అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారులు మర్రి లక్ష్మణ్ రెడ్డి పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించారు. ఈ మేరకు బోయిన్పల్లి ప్లే గ్రౌండ్లో మర్రి లక్ష్మణ్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ 77 ఏండ్ల వయస్సులో కూడా యువ క్రీడాకారుల మాదిరి మర్రి లక్ష్మణ్ రెడ్డి పతకాలు సాధించడం కంటోన్మెంట్‌కే గర్వకారణమన్నారు. క్రీడలు దేహదారుఢ్యం, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి కంటోన్మెంట్ ప్రాంతంతో పాటు రాష్ట్రం, దేశానికే గర్వకారణమన్నారు. బోయిన్పల్లి ప్లే గ్రౌండ్లో ఎందరో క్రీడాకారులు శిక్షణ పొందారని తెలిపారు. జూన్ 1-3 వరకు జాతీయ స్థాయి ఫిస్ట్‌బాల్ పోటీలు ప్లే గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీ య స్థాయిలో జరిగిన 75 ఏండ్ల ఈ పోటీల్లో బంగారు మెడల్స్ సిల్వర్ మెడల్ సాధించినందుకు ఆనందంగా ఉందని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అసోస ియేషన్ ప్రధాన కార్యదర్శి రాగిరు ప్రభుకుమర్ గౌడ్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు జగదీష్. సాయిబాబా యాదవ్, సత్యనారాయణ, స్టాన్లీ. సిరాజ్, అజిత్, ముకేష్ యాదవ్, వరప్రసాద్, బండి శ్రీనివాస్, శంకరయ్య, ప్రభు కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.