Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం
- మేడ్చల్ పట్టణ కేంద్రంలో సంఘం జిల్లా మహాసభ.. నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-మేడ్చల్
ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలనీ, ఇప్పటికే పెంపకందారుల వద్ద ఉన్న గొర్రెలన్నింటికీ ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ చేసింది. మంగళ వారం మేడ్చల్ పట్టణ కేంద్రంలో గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా మహాసభ జరిగింది. గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రావుల జంగయ్య, రవీందర్ హాజరై మాట్లాడారు. గొర్రెల మేత కోసం కాపరులకు చాలా ఇబ్బందిగా మారిందనీ, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలను ధనవంతులు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మరో పక్క అటవీ పరిసరాల్లోకి మేతకు రానీయకుండా కంచెలు వేయిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని కోరారు. గొర్రెల ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా పశువైద్యశాలలు ఏర్పాటు చేసి, వైద్య సదుపాయాలు కల్పించాలనీ, ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభలో గొర్రెల మేకల పెంపకం దారుల నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా మేకల కుమార్, ఎక్కల దేవి కొమురయ్య, ఉపాధ్యక్షులుగా సానం మల్లేష్, నల్ల రాములు, వడ్డెర బాలయ్య, బండారి మల్లేష్, సహాయ కార్యదర్శులుగా దయ్యాల వెంకటేష్, ఆంజనేయులు, గాజుల వీరేందర్, భవాని వెంకటేష్ ఎన్నికయ్యారు. మొత్తం 16 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.