Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
సుల్తాన్ బజార్లోని బడిచౌడి ప్రాంతంలో గల సనారి ఉమెన్స్ వియరింగ్ బట్టల షాపులోని 3వ అంతస్తులో మంగళవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనీ, దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు షాపు యజమాని ఎండి. శరీప్ మోతిన్ తెలిపారని చెప్పారు. విద్యుత్ అధిక లోడ్, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మూడు కుట్టు మిషన్లు, రెండు ఏసీలు, డ్రెస్ మెటీరియల్స్ కాలిపోయినట్లుగా గుర్తించామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. మంటలను అదుపులోకి తేవడానికి ఫైర్ సిబ్బందికి 15 నిమిషాల సమయం పట్టిందన్నారు. మంటలు ఆర్పిన వారిలో గౌలిగూడ అగ్నిమాపక ఎస్ఐ, ఏడుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.