Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్రప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 19న నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్ బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2022 నుంచి నూతన మోటార్ వాహన చట్టం అమలు చేస్తుందన్నారు. దీంతో ఫిట్నెస్ సమయం అయిపోతే రోజుకు రూ.50ల ఫెనాల్టీ చొప్పున విధించటం జరుగుతుందని, దీనిని ఆటో, క్యాబ్, లారీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. కరోనా ప్రభావంతో గత రెండేండ్ల నుంచి రాష్ట్రంలో వాహనాలు నడవడంలేదని, ఆర్థిక పరిస్థితుల వల్ల ఫిట్చేసుకోని వాహనాలకు సంవత్సరానికి రూ.18 వేలు చొప్పున అదనపు రుసుము వసూలు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ అదనపు భారాన్ని మోయడానికి ఆటో కార్మికులు సిద్దంగా లేరని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రోజుకు రూ.50 ఫెనాల్టీని రద్దు చేయాలని చేశారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటో క్యాబ్ మీటర్ రేట్లు పెంచాలని, అంతర్ సరిహద్దుల్లో సింగిల్ పర్మిట్ ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 19న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే రవాణా బంద్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ ఐఎఫ్ ఐఎన్ లారీ, క్యాబ్, ఆటో యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఎండీ అమనుల్లాఖాన్, ఎ.సత్తిరెడ్డి, రాశేఖర్ రెడ్డి, ప్రేమ్, ఆర్.మల్లేష్, ఎ.బిక్షపతి యాదవ్, ఉమర్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.