Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిహ్మ రెడ్డి అన్నారు. బుధవారం 12వ డివిజన్లో మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లా డుతూ మిషన్ భగీరథ పథకం అమలు చేయడం వల్ల ఇంటింటికీ మంచి నీరు అందజేయాలని మొదటి ప్రాధాన్యతగా మంచి నీటి పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో కార్పొరేషన్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుక్క శివ కుమార్ పాల్గొన్నారు.