Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లో అలసత్వం వాహనదారులకు ఇబ్బందులు
- ప్రజల ఆస్తులు కోల్పోకుండా నిర్మాణం చేపట్టాలి
- సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా స్థానికులు వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ(ఎం) హైదరా బాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గోల్కొండ క్రాస్ రోడ్డులోని పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు దశరథ్, రాంనగర్ డివిజన్ కార్యదర్శి రాములుతో కలిసి మాటా ్లడారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన బ్రిడ్జి పనులను కాలం గడిచి పోయినప్పటికీ సగం కూడా పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుంచి ఒక అడుగు ముందుకు రెండు అడు గులు వెనక్కి అన్న చందంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. పిల్లర్ ఫౌండేషన్ పనుల కోసం గుంతలు తవ్వి పూడ్చివేసి ఫౌండేషన్ ప్లానింగ్ మార్చారని తెలిపారు ఫౌండేషన్ పనులు ప్రారంభమైన తర్వాత డ్రయినేజీ పనులను మొదలుపెట్టి బ్రిడ్జి నిర్మాణ పనులకు కారణమైన కాంట్రాక్టర్, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంనగర్ -బాగ్‌లింగంపల్లి మధ్య నిర్మించే సెకండ్ లెవెల్ బ్రిడ్జ్ మొదట నిర్ణయించిన డిజైన్ ఆకస్మాత్తుగా మార్చారనీ, మొదటి డిజైన్ ప్రకారం ఆర్టీసీ కల్యాణ మండపం ముందు క్రికెట్ అకాడమీ దగ్గర బ్రిడ్జి పూర్తి కావాల్సి ఉండగా దాన్ని అంబేద్కర్ కాలేజీ చౌరస్తా వరకు పొడగించినట్టు తెలిపారు. ఈ మార్పు కారణంగా ఎమ్ఐజీ బ్లాక్స్‌లోని దాదాపు 40 కుటుంబాలు ఫ్లాట్స్ ప్రజలు తమ ఆస్తులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రాంనగర్-బాగ్‌లింగంపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం అవసరమా? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థి తిలో నూతన డిజైన్ పేరుతో కోట్ల రూపాయల ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డిజైన్ మార్క్ పేరుతో భారీగా స్థలం కాజేయడం బడ్జెట్ గురించి ప్రజాధనాన్ని నింపుకో వడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తుందన్నారు. ఇందిరాపార్కు వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేసి రామ్‌నగర్-బాగ్ లింగంపల్లి బ్రిడ్జ్ డిజైన్ మొదట నిర్ణయించిన మాదిరిగా ప్రజల ఆస్తులు కోల్పోకుండా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.