Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గం కృషి చేస్తుందని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శిల్పా నగర్ కాలనీ సమీపంలోని బృందావన్ కాలనీ వాసులు సొంత నిధులు రూ. 7 లక్షలతో చేపట్టనున్న డ్రయనేజీ పైప్ లైన్ పనులకు చైర్మన్ చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి. మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ కౌకుంట్ల అనంత రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.