Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
మంచబొల్లారం డివిజన్ పవన్ ఎంక్లేవ్లో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని బొల్లారం రైల్వే స్టేషన్ వద్ద బాక్స్ డ్రెయిన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొంప ల్లి నుంచి బొల్లారం రహదారి వెంట విజరు విహార్ కాలనీ వరకు కచ్చా డ్రెయిన్ నీరు ప్రమాదకరంగా మారిందనీ, పవన్ కాలనీ నివాసితులకు ఆర్సీసీ కాలువ అవుట్లయిట్ లైన్ కోసం ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు సహాయంతో పనులు చేపట్టనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ మహేష్, డీజీఎం సాంబయ్య, శానిటేషన్ సూపర్వైజర్ బుచ్చయ్య, మేనేజర్ రమేష్, ఏఈ రవళి, ఎన్ఏసీ ఏఈ ప్రత్యూష, అఫ్రోస్, విజ్ఞేష్, హరిబాబు, మహేందర్ కాలనీ వాసులు సంతోష్, కొండల్ రెడ్డి, నగేష్, నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శోభన్, ఆనంద్ పాల్గొన్నారు.