Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఒకటి వాడు బోయిన్పల్లి బాపూజీ నగర్లో రెండు మహిళా పొదుపు సంఘాలకు గురువారం మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి రూ.12 లక్షల రుణాలను అందజేశారు. బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహేశ్వర్ రెడ్డి హాజరై కెనరా బ్యాంక్, బోయిన్పల్లి శాఖ ద్వారా మంజూరైన రుణాలను అందజేశారు. జేఎంఆర్ పొదుపు సంఘానికి రూ.6 లక్షలు, శ్రీ రేణుల ఎల్లమ్మ పొడుపు సంఘం గ్రూప్‌కు రూ.6 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధిపై ఎద గాలన్నారు. వార్డులో ఇప్పటి వరకు అనేక మంది మహిళా పొదుపు సంఘాల గ్రూపుల వారు రుణాలు పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారని చెప్పారు. రుణాలు పొందిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మ, సౌజన్య, స్రవంతి, సంధ్య, కృష్ణవేణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.