Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్ తిరుమలనగర్‌లో రూ.18 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి, డ్రయినేజీ, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు వంటి పనులు విస్తతంగా చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డ్రయినేజీ, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పైప్ లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం బస్తీలో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈలు సుధాకర్, వెంకటరమణ, ఏఈలు ఫరీద్, ప్రసాద్, మేనేజర్ రోహిత్‌తో పాటు బస్తీవాసులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.