Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్
- ఎంసీహెచ్ కాలనీలో పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే ముఠాగోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
డ్రయినేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ ఎంసీహెచ్ కాలనీలో రూ .2.50 లక్షల వ్యయంతో నూతన డ్రయినేజీ పైప్‌లైన్ పనులకు కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో డ్రయినేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నామని చెప్పారు. కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్లో నాలుగు డ్రయినేజీలకు సంబంధించి కొత్తపైప్‌లైన్ పనులకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం వాహబ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, యువజన నాయకులు ముఠా జైసింహ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శ్రీధర్ రెడ్డి, అజరు ముదిరాజ్, భీమరధి అశోక్, సాంబశివరావు, భిక్షపతి యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, లక్ష్మణ్ గౌడ్, దీన్ దయాళ్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, బాల్‌రాజ్ గౌడ్, బల్ల ప్రశాంత్, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ కో కన్వీనర్ నవీన్‌గౌడ్, డివిజన్ అధ్యక్షులు బద్రీనారాయణ, నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.