Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
పార్లమెంట్లో బీసీ బిల్లుకు, బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు ప్రజా గొంతుకనై గర్జించి గళం వినిపిస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభ సభ్యులుగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం విద్యా నగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్ కష్ణయ్య హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతిగా చిరకాల ముద్ర వేశారన్నారు. 25 మంత్రి పదవుల్లో 10 బీసీలకు కేటాయించి బీసీల హదయాల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు అని తెలిపారు. 40 ఏండ్లుగా బీసీల సమస్యలపై డిమాండ్లపై ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న తనను తన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు కేటాయించడంపై 80 బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉద్యోగ ఆర్టీసీ వివిధ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. బీసీల సమస్యలపై పోరాడేందుకు బీసీ బిల్లుపై పార్లమెంట్లో గళం వినిపించేందుకు పదునైన ఆయుధం లభించిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా పెళ్లి అంజి, కన్వీనర్ కట్టా బబ్లు గౌడ్, పగిలి సతీష్, రామకోటి, సుజిత్ కుమార్, భాస్కర్ ప్రజాపతి తదితర నాయకులు పాల్గొన్నారు.