Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కె.కవిత
నవతెలంగాణ-కల్చరల్
తాను ఎంచుకున్న రంగంలో పట్టుదలతో అవిశ్రాంతంగా కషి చేసిన సుశీలమ్మ జీవితం మహిళలకు స్ఫూర్తివంతమని శాసనమండలి సభ్యులు కె.కవిత అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై శతి లయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ, సీల్వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు సౌజన్యంతో విఖ్యాత గాయని డాక్టర్ పీ.సుశీల 70 వసంతాల పాటల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఆమెను ఘనంగా సత్కారించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ సుశీల ఏ భాషలో పాడిన ఆ భాషా గాయనిగా భావిస్తారని అన్నారు. సుశీల తెలుగు వారు కావటం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణం అన్నారు. ఆమె ఎన్నో పాటలకు తాను అభిమానినని 'లాలీ లాలీ' పాటను పాడేందుకు ప్రయత్నించానని గుర్తు చేసుకొన్నారు. తిరుమల గ్రూప్ అధినేత ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన సభలో శాసనమండలి సభ్యులు మధుసూదనాచారి, కోలేటి దామోదర్, వంశీరామరాజు, బండారు సుబ్బారావు, రఫీ, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆమని, కనక ఫంహ్రగా, సుభాష్ తదితరులు పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి.