Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎస్.ఎన్.డి.పి, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులచే ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతు రాబోయే తరాలను దష్టిలో పెట్టుకొని నూతన డ్రైన్స్, రోడ్లు, మంచినీటి సమస్యలు లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. దానిలో భాగంగా సాగర్ ఎన్క్లేవ్, తపోవన్ కాలనీ, వంగ శంకరమ్మ దగ్గర, ఇతర డివిజన్ల నందు జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని, నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే వర్షాకాలం దష్ట్యా ఎస్.ఎన్.డి.పి. పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనామా నుండి డీర్ పార్క్ వరకు పైలెట్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్ మరియు అందమైన పూల మొక్కలు నాటాలని సూచించారు. అలాగే నియోజక పరిధిలోని నాలాల పనులను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే గత వరదల్లో కొన్ని,కొన్ని ప్రాంతాల్లో డ్రైన్స్, వాటర్ లైన్స్ దెబ్బతినడం జరిగింది. కావున వాటిని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని ఎక్కడెక్కడ ఔట్లెట్స్ నాలాలు వధాగా ఉన్నాయో గుర్తించాలని సూచించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని చెరువులను సుందరీకరణ చేసి, చెరువు చుట్టుముట్టు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ నూతన సీసీరోడ్లు మరియు డ్రైన్స్ నిర్మాణ పనులు చేపట్టాలో గుర్తించాలని తెలిపారు. బాక్స్ డ్రైన్స్ మరియు ఓపెన్ నాల పనుల్లో భాగంగా ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులకు మీ యొక్క సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పనులు సకాలంలో చేసిన అధికారులకు బిల్లులు సమయానికి చెల్లిస్తాము అని తెలిపారు. నియోజకవర్గ అభివద్ధి కోసం మీ యొక్క తోడ్పాటు ఎంతో ముఖ్యం అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎల్బీనగర్ రేందర్ రెడ్డి, ఎస్.ఈ.అశోక్ రెడ్డి, ఈ.ఈ. రమేష్‌బాబు, ఇరిగేషన్ డీ.ఈ.పవన్, ఈ.ఈ.కోటేశ్వర రావు, ఎస్.ఎన్.డి.పీ. ఈ.ఈ.కష్ణయ్య, ఎల్.బి.నగర్ వాటర్ వర్క్స్ జీ.ఎం.బల రాం రాజు, ఎల్.బి.నగర్ వాటర్ వర్క్స్ జీ.ఎం.వినోద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.