Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సేవాదళ్ కోశాధికారి జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని ప్రయివేటుపరం చేసే ప్రయత్నంలో ఉందని అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ కోశాధికారి కానుకల జనార్దన్‌రెడ్డి విమర్శించారు. గురువారం కేజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డైమండ్ పాయింట్ చౌరస్తాలో రాష్ట్ర సేవాదళ్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బీజేపీ హయాంతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతోందన్నారు. రైతులకు, కార్మికులకు ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పేదలు సంతోషంగా ఉండేవారని, బీజేపీ పాలనతో బతకలేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రజలకోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకోసం తనవంతు కృషి చేస్తానని, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.