Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ నియోజకవర్గ కార్యదర్శి శీలం ప్రభాకర్
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి తలసాని, ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ నియోజకవర్గ కార్యదర్శి శీలంప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రూ.16 వందల కోట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మంత్రి, స్థానిక మ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్లో అయితే తలసాని చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే రూ.16 వందల వర్క్ ఆర్డర్లను బహిర్గతం చేయాలని, ప్రజలకు వివరించాలని కోరారు. ఓ వైపు నాలాల పూడికతీత పనులు మరిచి, జనాలకు అవసరంలేని పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. గతంలో వదర ముంపునకు గురైన బస్తీల్లో సమస్య ఎంతవరకు పరిష్కరిం చారని ప్రశ్నించారు. ముఖ్యంగా నాలాలకు ఆనుకుని ఉన్న ఇండ్ల డ్రయినేజీ వ్యవస్థను నాలాల్లో కలిపారని, దాంతో నాలాలపై అధిక భాగం వర్షం పడినప్పుడు నీళ్లు పొంగి ఇండ్లల్లోకి చేరుతున్నాయని చెప్పారు. అలా కాకుండా నాలాలకు ఆనుకుని ఉన్న ఇండ్ల డ్రయినేజీ వ్యవస్థను డ్రయినేజీ లైన్లోనే కలిపే విధంగా మున్సిపల్, వాటర్ వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా మంత్రి తలసాని అభివృద్ధి చేశామని చెప్పుకోకుండా ప్రజలకోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు దయానంద్, నాయకులు సికె నర్సింగ్ రావు, విష్ణులు ఉన్నారు.