Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడకు జాతీయ స్థాయి హోదా కోసం కషి చేస్తాము
- అధ్యయన యాత్ర అనుభవాలను మీడియాకు వెల్లడించిన పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ఇంట్లోని చెత్తను వేరు చేయడం ద్వారా అనేక లాభాలుంటాయని అది చెత్త కాదని చెదిరి పోయిన సంపదను ఒక్క దగ్గరికి చేర్చడమేనని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారంనాడు మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ సమావేశంలో స్టడీ టూర్ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్సన్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల, కమిషనర్లు, మున్సిపల్ చైర్మెన్లు, వైస్ చైర్మెన్ల బందం దేశంలోని ఇండోర్, అమత్సర్, చండీగర్ నగరాలలో పర్యటించిందని అన్నారు. ముఖ్యంగా ఇండోర్ నగరంలో ఇంట్లోని చెత్తను ఆరు రకాలుగా వేరు చేసి చెత్త ఇస్తారని అందులో తడి, పొడి, హానికరమైన చెత్త, ఈ వెస్ట్‌తో పాటు ఇంకా ఇతర చెత్తను వేరు చేసి ఆటోలలో వేస్తారని, అలా వచ్చిన చెత్తను 18 రకాల ఉత్పత్తులను వేరు చేసి రీ సైక్లింగ్ చేసే కంపెనీలకు విక్రయించడం ద్వారా పట్టణానికి ఆదాయం తోపాటు వంద శాతం చెత్త రహిత నగరంగా ఉంటుందని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఇండో నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీిలలో 2015 నుండి ఐదుసార్లు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. అదే స్థాయిలో పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను కూడా తీర్చడానికి కషి చేస్తామని మేయర్ తెలిపారు. ఇవన్నీ కావాలంటే మొదట మన ఇంట్లో మార్పులు రావాలని అలా చేయడం ద్వారా సమాజాన్ని మార్చడం సులభతరంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, బచ్చ రాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోరంజన్ రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, చెరుకు పెంటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.