Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికిగాను ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారంనాడు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో 4కోట్ల రూపాయల వ్యయంతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్మ్షీగౌడ్, స్థానిక కార్పొరేటర్ దానగళ్ల అనిత, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సుమన్ నాయక్, జలమండలి డీజీఎం కార్తీక్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దానగళ్ల యాదగిరి, డివిజన్ అధ్యక్షుడు రాములు, కాలనీవాసులు మల్లేష్, గణేష్‌లు పాల్గొన్నారు.
పాఠశాల స్థలంలో వాటర్ హెడ్ ట్యాంకు నిర్మాణం వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్ నూతనంగా చేపట్టే వాటర్ హెడ్ ట్యాంకు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఆట స్థలంలో వాటర్ ట్యాంకు నిర్మించడం సరైన విధానం కాదని, ఇది ముమ్మాటికీి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడేలా మంత్రి చర్యలు ఉన్నాయని విమర్శించారు.
విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి ఆట స్థలం లేకుండా చేయవద్దని డీఈవోకు కూడా ఫిర్యాదు చేశామని, ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి మల్లారెడ్డి అగమేఘాల మీద శంకుస్థాపన చేయడం ఎందుకని ప్రశ్నించారు. శంకుస్థాపన చేసి వెళ్ళిపోతున్న మంత్రి కాన్వారుని అడ్డుకునే ప్రయత్నం చేయగా మేడిపల్లి పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్, గర్ల్స్ కన్వీనర్ నాగజ్యోతి, సీపీఐ నాయకులు దండు రమేష్, మాధవి, కిషన్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.