Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 714 (ఈ) నోటిఫికేషన్ రద్దు చేయాలని సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్.కిషన్, శేఖర్, వి.రాంకుమార్, ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సౌత్ జోన్ ప్రెసిడెంట్ బాబార్ ఖాన్ డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రయివేట్ చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరంం ఆర్టీవో సదానందంకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 714 (ఈ) నోటిఫికేషన్ రద్దు చేయాలని, ఫిట్నెస్ గడువు అయిపోతే రోజుకు రూ.50 చొప్పున పెనాల్ట్టీ వెనక్కి తీసుకోవాలన్న్షారు. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలవల్ల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వీటిని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం లేకపోవడం దురదష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తెచ్చిన 714(ఈ) నోటిఫికెషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్లు జంగిర్, కలిమ్, ఖాజా, జకేర్, హమీద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.