Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలు పూర్తికావడంతో కేరింతలు కొట్టిన విద్యార్థులు
- కేంద్రాల వద్ద విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు.
- 234 కేంద్రాల్లో 64,429 మంది హాజరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిశాయి. ఇప్పటికే ఫస్టియర్ ఎగ్జామ్స్ పూర్తయిన సంగతి తెలిసిందే. గురువారం నాటితో సెకండియర్ ఎగ్జామ్స్ కూడా ముగియడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పరీక్షలు ముగిసిన సంతోషంతో కేరింతలు కొట్టారు. స్టూడెంట్స్ ఒకరినొకరు ఆత్మీయ పలకరించుకోవడం కనిపించింది. కాగా పరీక్షల చివరి రోజు కావడంతో విద్యార్థుల తాము రాసిన పరీక్షలపై చర్చించుకున్నారు. ఎన్ని మార్కులు వస్తాయోనని ఒకరినొకరు అడిగి తెలుసు కున్నారు. మొబైల్ నంబర్లు షేర్ చేసుకున్నారు. అనంతరం వీడ్కోలు చెప్పుకున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలు ముగియడంతో తమ తమ సొంతూళ్లకు పయన మయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లవద్ద విద్యార్థులతో సందడి వాతావరణం కనిపించింది. ఈనెల 6న ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా సెకండియర్ పరీక్షలు 234 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 67,878 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 64,429 మంది హాజరయ్యారు. జనరల్‌లో 66,143 మంది గాను 62,830 మంది హాజరు కాగా 3,313 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 1,735 మందికి గాను 1,599 మంది హాజరవ్వగా..136 మంది గైర్హాజరయ్యారు.