Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో.. ట్రాఫిక్ మళ్లింపులు
- వివరాలు వెల్లడించిన ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ. రంగనాథ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంబర్పేట ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీి ఏవి రంగనాథ్ తెలిపారు. గురువారం ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోల్నాక నుండి అంబరేపేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయమార్గం అనుసరించాలని కోరారు. ఉప్పల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు అంబర్పేట శ్రీరమణ థియేటర్ సర్కిల్ నుండి అలీ కేఫ్ చౌరస్తాకు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి జిందా తిలిస్మాత్ రోడ్డును కలుపుకొని గోల్నాక వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇక చాదర్ఘాట్ వైపు నుండి వచ్చే వాహనదారులు కాచిగూడ నింబోలీ అడ్డా మీదుగా టూరిస్ట్ హోటల్వైపు నుండి వెళ్తూ ఫీవర్ ఆస్పత్రి తిలక్ నగర్ మీదుగా ఛే నెంబర్ సర్కిల్ వైపు వచ్చి, తిరిగి రామంతాపూర్ రోడ్డుకు వైపునకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రెండు సార్లు ట్రయల్ రన్ చేసి ఇబ్బందులను గుర్తించి వాటిని మెరుగు పరిచామని సీపీ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు.