Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సివిల్ జడ్జి మురళీ మోహన్
- పూరానా పూల్ ఏరియాలో న్యాయ విజ్ఞాన సదస్సు
- పేదల గుడిసెలను సందర్శించిన న్యాయవాది
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాధితులకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందని సీనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. మురళీమోహన్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ చీఫ్ జడ్జి రేణుకా యారా ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సిటీ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో గురువారం పురానాఫూల్ ప్రాంతంలోని పేదల నివాస గృహ సముదాయాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మురళీ మోహన్ ఇక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రకతి వైపరీత్యాలకు ఇండ్లు, ఆధారం కోల్పోయిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. బాధితులకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ.. గహ హింస చట్టంపై అవగాహన కల్పించారు. పురుషులు మహిళల కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని, మహిళలపై హింస, వేధింపులు చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అనంతరం మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న పేదల ఇండ్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఇక్కడి ప్రజల సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమములో పారా లీగల్ వాలంటీర్స్ స్పెషల్ సెల్ సభ్యులు పి. రామారావు, సరోజ భాస్కర్, సునీల్, బాబు తదితరులు పాల్గొన్నారు.