Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తరహాలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ఎన్ నరేందర్ రావు అన్నారు. శుక్రవారం అబిడ్స్‌లోని బీమాభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్, ఛత్తీస్గడ్ తరహాలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ని పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసి ఏడాది దాటినా మార్గదర్శకాలు విడుదల కాకపోవడం వల్ల మరణించిన ఉద్యోగస్తుల కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తగు మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగస్తుల పీఆర్ఎఎన్ ఖాతాల్లో జమ చేయబడిన మొత్తాన్ని గ్యారెంటీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఋణ సహాయం పొందడానికి వీలు కల్పించే కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాంటి ఉత్తర్వుల్ని వెంటనే ఉపశమహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా తలసేమియా బాధితుల కోసం ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని తీర్మానించడం చేశారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కోటకొండ పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎన్ అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీ. శ్రీవాణి, ఆర్గనైసింగ్ సెక్రటరీ శివకుమార్, కె.అరవింద్, జాయింట్ సెక్రటరీ ఎం.రాజేష్, మహమూద్ అలీ, ఈసీ మెంబర్ బి సుధాకర్ పాల్గొన్నారు.