Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అంగడిపేట్ పీఎస్ఆర్ ప్రైడ్ అపార్టుమెంట్ వద్ద కోల్ నాలా నిర్మాణ పనుల్లో భాగంగా ఇక్కడి అపార్టుమెంటుకు చెందిన ప్రహరీగోడ కూలడంతో అపార్టుమెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెంటనే అక్కడికి చేరుకుని అపార్టుమెంట్ వాసులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కూలిన గోడను పరిశీలించారు. తిరిగి నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రామారావు, సురేందర్ నాయక్, అపార్టుమెంట్ వాసులు మదన్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.