Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జీడిమెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టన శుక్రవారం జరిగింది. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివే కానంద్ పాల్గొని మాట్లాడారు. ఆధునిక సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన రూపంలో చెప్పారన్నారు. ధర్మ పరిరక్షణకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ అన్నోజు కృష్ణమాచారి, వైస్ చైర్మెన్ కమ్మరి జయ గోపాలచారి, వేణుగోపాల చారి, కమ్మరి లక్ష్మణ చారి, ప్రెసిడెంట్ శ్రీనివాసచారి, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బాలా చారి, సాయి బాబా, జనరల్ సెక్రెటరీ పురుషోత్తమా చారి, జాయింట్ సెక్రెటరీ వీరబ్రహ్మేంద్ర చారి, శ్రీనివాస చారి, విరాట్ శేఖర్, విష్ణు చారి, మోహన్ రావు, ట్రెజరర్ కొత్తపల్లి మోహన్ రావు, ఆర్గనైజర్ రాఘవ చారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సత్యనారాయణ, శ్రీనివాసచారి, నరహరి, నరసింహచారి, బాలరాజు, యాదగిరి, శ్రీకాంత్‌చారి, సాయి ప్రదీప్, శ్రీనివాస్ సోనీ, సంతోష్‌చారి, బ్రహ్మచారి, స్థానిక నాయకులు కిషోర్‌చారి, నాగేష్చారి, సంపత్ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు.