Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్
నవతెలంగాణ-బాలానగర్
ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ఆదేశాల మేరకు ఫతే నగర్ 118 డివిజన్ పరిసరాల పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తామని కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని ముందస్తుగా శుక్రవారం పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో బస్తీ లో ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. కార్యక్రమంలో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్‌ను జీహెచ్ఎంసీ శానిటైజింగ్ డిపార్ట్మెంట్ జమిందార్ పోచయ్య, ఎస్ఎఫ్ఏలు, ఆర్పీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వచ్చే పట్టణ ప్రగతి కార్యక్రమంలోపు మిగితా మిగిలిన మట్టి కుప్పలను ఎత్తివేసి పరిశుభ్రత కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి రేపటి తరానికి నేర్పించాలని చెప్పారు. కార్యక్రమంలో కర్ణాకర్, రవీంద్రనాథ్ గౌడ్, కే. భాగయ్య, సురేందర్ నాయుడు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.